Header Banner

గల్ఫ్ ఎక్స్ గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశం! 113 బాధిత కుటుంబాలకు..

  Sat Mar 01, 2025 21:31        Gulf News

గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణా రావును ఆదేశించినట్లు తెలంగాణ ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్బంగా అనిల్ ఈరవత్రి గల్ఫ్ ఎక్స్ గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసికెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారు. 

 

ఇది కూడా చదవండి: UAE: యువ బైకర్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు! ఇలా చేస్తే భారీ జరిమానా, కఠిన చర్యలు!

 

శనివారం సాయంత్రం అందిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లాలో 31, నిజామాబాద్ లో 28, రాజన్న సిరిసిల్ల లో 8, నిర్మల్ లో 5, కామారెడ్డి, సిద్దిపేట నాలుగు చొప్పున, కరీంనగర్, మంచిర్యాల మూడు చొప్పున, మెదక్ లో రెండు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలలో  ఒకటి చొప్పున మొత్తం 94 మంది ఖాతాలలో రూ.5 లక్షల చొప్పున సొమ్ము జమ అయినది. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకునేలా రూ.5 లక్షల పరిహారం నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ గౌడ్, అనిల్ ఈరవత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డా. ఆర్.భూపతి రెడ్డి, ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం తో పాటు సహకరించిన నాయకులు, గల్ఫ్ కార్మిక నాయకులకు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Gulfnews #indians #Telangana #Government #Helping